పరిహారం ఇవ్వకుంటే ఉద్యమమే
ABN , First Publish Date - 2020-12-02T05:03:12+05:30 IST
రైతన్న కష్టాల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం మానేసిందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
పిడుగురాళ్ల, డిసెంబరు1: రైతన్న కష్టాల్లో ఉంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవటం మానేసిందని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం వీరాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో వ్యవసాయాధికారులెవరూ ఇంతవరకు పంటనష్టాన్ని అంచనా వేసేందుకు రాకపోవటం శోచనీయమన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఏడాది పంట నష్టపరిహారం కూడా ఇప్పటికీ ఇవ్వకపోవటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించిన తెలుగుదేశం సభ్యులను, మాజీ సీఎం చంద్రబాబును సస్పెండ్ చేయటం శోచనీయమన్నారు. నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.50వేలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారం, పదిరోజుల్లోగా పరిహారం చెల్లించకపోతే రైతులతో కలసి ఢిల్లీ ముట్టడి తరహాలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రైతులకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.