మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహనరావుకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-13T06:24:47+05:30 IST

నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహనరావు 12వ వర్థంతి సందర్భంగా సీపీఎం రాజధాని డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని కృష్ణాయపాలెంలో ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహనరావుకు ఘన నివాళి
కృష్ణాయపాలెంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహనరావు విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీపీఎం రాజధాని డివిజన్‌ కమిటీ నేతలు

మంగళగిరి రూరల్‌,  డిసెంబరు 12: నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామ్మోహనరావు 12వ వర్థంతి సందర్భంగా సీపీఎం రాజధాని డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని కృష్ణాయపాలెంలో ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీపీఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం  పనిచేసిన నిమ్మగడ్డ రామ్మోహనరావు లేని లోటు తీర్చలేనిదన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాజధాని డివిజన్‌ నాయకులు కె.సుందరయ్య, భాగ్యరాజు,  ఎస్‌కే ఎర్రపీరు,  వెంకటేశ్వరరావు, వీర వెంకయ్య, నిమ్మగడ్డ రామ్మోహనరావు సతీమణి లక్ష్మీసామ్రాజ్యం, సోదరులు రమేష్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T06:24:47+05:30 IST