-
-
Home » Andhra Pradesh » Guntur » ENGENEERING
-
ఇంజనీరింగ్ ప్రవేశానికి..నేటి నుంచి వెబ్ కౌన్సెలింగ్
ABN , First Publish Date - 2020-12-28T05:29:11+05:30 IST
ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నేటినుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

మూడు ప్రాంతాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు
ఇంటర్‌నెట్‌లోనూ వెబ్ ఆప్షన్లకు అవకాశం
గుంటూరు(విద్య), డిసెంబరు 27: ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం నేటినుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. తొలిరోజు ఒకటి నుంచి 60వేల ర్యాంకుల వరకు, రెండో రోజు 60001 నుంచి చివరి ర్యాంకు వచ్చిన విద్యార్థులు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీట్లు ఎంచుకునే అవకాశం కల్పించారు. ఇంటర్‌నెట్ కేంద్రాలు లేదా హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా కళాశాలల్లో సీట్లు ఎంచుకోవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ తరువాత మరోసారి ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంది. తుది జాబితా జనవరి 3న ప్రకటిస్తారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా నరసరావుపేటలోని జేఎన్‌టీయూ ఇంజ నీరింగ్ కళాశాల, ఏఎన్‌యూ, నల్ల పాడులోని ఎంబీటీఎస్ పాలిటెక్నిక్ లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీట్ల ఎంపికకు ఇచ్చే ఆప్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు.