పాత ఫీజులతో మూతే గతి!

ABN , First Publish Date - 2020-12-27T05:17:02+05:30 IST

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల రెగ్యులేటరీ కమిటీలు నెలల తరబడి తనిఖీలు నిర్వ హించాయి. అక్కడ ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరి శీలించాయి.

పాత ఫీజులతో మూతే గతి!

 పాత ఫీజులనే ఖరారు చేసిన ప్రభుత్వం

 ఇంజనీరింగ్‌ యాజమాన్యాల అసంతృప్తి

 అధ్యాపకుల జీతాలైనా ఇవ్వాలి కదా అంటూ ఆవేదన

 భవిష్యత్‌ కార్యాచరణపై ఈ నెల 28న  నిర్ణయం


ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పాత ఫీజులనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై యాజ మాన్యాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. కళాశాలల నిర్వహణ భారం పెరిగిందని మును పటి ఫీజులనే వసూలు చేయాలంటే అధ్యా పకులకు సగం జీతం కూడా ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌ కార్యాచరణకు ఈ నెల 28 న విజయవాడ లో రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్‌ కళా శాలల యాజ మాన్యాల సమావేశం నిర్వహించనున్నారు


గుంటూరు(విద్య), డిసెంబరు 26: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజుల రెగ్యులేటరీ కమిటీలు నెలల తరబడి తనిఖీలు నిర్వ హించాయి. అక్కడ ఉన్న సౌకర్యాలను పూర్తిస్థాయిలో పరి శీలించాయి. పాత ఫీజులనే ఖరారు చేస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.  ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రస్తుతం నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయి. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక కళాశాలలు నాన్‌టీచింగ్‌ సిబ్బందిని సగానికి సగం తగ్గించాయి. వారుచేసే పనులు పరిమిత సిబ్బందితోనే చేయిస్తు న్నారు. మరోవైపు ల్యాబ్‌లు, లైబ్రరీ నిర్వహణ, పుస్తకాల కొనుగోలు, సదస్సులు, సెమినార్లు, టూర్‌ ప్రోగ్రాం, బస్సుల నిర్వహణ, అధ్యాపకుల జీతాలు, బిల్డింగ్‌ నిర్వహణ ఇలా అనేక వ్యయాలు వారికి గుదిబండగా మా రాయి. ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు తీసుకుంటే మనుగడ కష్టం అని భావిస్తున్నాయి. 


మనుగడ ప్రశ్నార్ధకం

జిల్లాలో డీఈడీ, బీఈడీ కళాశాలల మాదిరిగా ఇంజనీరింగ్‌ కళాశాలల పరిస్థితి మారే అవకాశం ఉందని యాజమాన్యాలు అందోళన వ్యక్తం చేస్తు న్నాయి. పూర్తిస్థాయిలో అధ్యాపకుల్ని నియమించు కోలేక రెండుమూడు కళాశాలల్లో ఒకే అధ్యాపకుడు పనిచేసే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన చెందు తున్నారు. అధ్యాపకుల అప్రూవల్‌ విషయంలో అక్ర మాలకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. ఇప్పు డున్న పరిస్థితిలో కనిష్టంగా రూ.70వేలు, గరిష్టంగా రూ.1.75లక్షలు ఫీజులు వసూలు చేస్తేనే ఇంజనీరింగ్‌ కళాశాలల మనుగడ సాధ్యమౌతుందని చెబుతున్నారు. లేకుంటే రానున్న రెండు మూడేళ్లలో మరికొన్ని కళా శాలలు మూసివేసే పరిస్థితి వస్తుందని వాపోతు న్నారు. ఇప్పటికే జిల్లాలో మూడు కళాశాలలు అడ్మి షన్లుకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


త్వరలో భవిష్యత్‌ ప్రణాళిక

ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోయేష న్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 విజయవాడలో సమావేశం నిర్వహించనున్నారు. అక్కడ చర్చించే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్‌ కార్యాచరణ ప్రక టించనున్నట్లు సమాచారం. ఫీజుల విషయంలో మరో సారి ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలని ఓ ఇంజ నీరింగ్‌ కళాశాల యాజమాన్య ప్రతినిధి అన్నారు. లేకుంటే అధ్యాపకులకు సగం జీతాలే చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందని, దీనివల్ల ఇంజనీరింగ్‌ బోధనలో నాణ్యత కొరవడుతుందని ఆయన వాపోయారు.

 

Updated Date - 2020-12-27T05:17:02+05:30 IST