-
-
Home » Andhra Pradesh » Guntur » emplyees
-
అంతా గోప్యమే..
ABN , First Publish Date - 2020-11-28T05:17:44+05:30 IST
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రి యపై క్వాలిఫై అయిన అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సచివాలయ ఉద్యోగుల ఎంపికపై అనుమానాలు
రోష్టర్ పాయింట్లు ప్రకటించకపోవడంపై సందేహాలు
ఎంపికైన వారి పేర్ల జాబితా కూడా ప్రకటించని వైనం
గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక ప్రక్రి యపై క్వాలిఫై అయిన అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయి నప్పటికీ ఇంకా రోష్టర్ పాయింట్ ఎక్కడి వరకు వచ్చిందనేది ప్రకటించకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లతో జాబితాలు ప్రకటించకుండా జాప్యం చేస్తుండటంపై ఏదో జరుగుతోందన్న భావనను వ్యక్తపరుస్తున్నారు. జిల్లాలోని సచివాలయాల్లో ఖాళీగా ఉన్న సుమారు 1400లకు పైగా పోస్టుల భర్తీకి ఈ ఏడాది సెప్టెం బరులో నిర్వహించిన రాతపరీక్ష రెండు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెరిట్-కమ్-రోష్టర్ పద్ధతి న ఒక్కో ఉద్యోగానికి ఇద్దరు అభ్యర్థులను ఇంటర్వ్యూ లకు పిలిచారు. ఈ నెల 16న వివిధ ప్రభుత్వ కార్యాల యాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు. త్వరలో ఎంపికైన అభ్యర్థులకు కాల్‌లెటర్స్ పంపుతా మని చెప్పారు. అప్పటి నుంచి ఇంటర్వ్యూలకు వెళ్లిన అభ్యర్థులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోన్నారు. ఇతర జిల్లాల్లో ఫలానా తేదీన అభ్యర్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతామని ముందుగానే అభ్యర్థు లకు తెలియజేశారు. అయితే మన జిల్లాలో మాత్రం అలాంటి ప్రకటన ఏదీలేదు. గుంటూరులో 333 వార్డు సచివాలయ కార్యదర్శి పోస్టులకు 296 మందికి శుక్రవారం కాల్‌లెటర్స్ పంపారు. మరో 37 మందికి శనివారం పంపుతామని అధికారులు చెబుతున్నారు. అయితే కార్పొరేషన్‌లో దీనికి సంబంధించి ఎలాంటి రోష్టర్ పాయింట్‌ని ప్రకటించలేదు. దీంతో ఇంట ర్వ్యూలకు హాజరై కాల్‌లెటర్స్ రాని వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అంతా గోప్యంగా జరుగు తుండటంపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.