నాడు నేడు పనుల పరిశీలన

ABN , First Publish Date - 2020-12-20T05:04:14+05:30 IST

నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యులు ఆచార్య వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ తదితరులు శనివారం పరిశీలించారు.

నాడు నేడు పనుల పరిశీలన

గుంటూరు(విద్య), డిసెంబరు 19: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులను స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ సభ్యులు ఆచార్య వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్‌ తదితరులు  శనివారం పరిశీలించారు. మధ్యాహ్న  భోజనం, పాఠశాలలో మౌలిక వసతులు  తనిఖీ చేశారు. విద్యార్థులకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు పెంచేలా  చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని, ఉర్దూ డీఐ ఎస్‌కే ఎండీ ఖాశిం, పాఠశాల హెచ్‌ఎం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read more