చిరుధాన్యాలతో సంగం స్వీట్లు

ABN , First Publish Date - 2020-05-24T08:03:43+05:30 IST

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అద్భుత రుచులతో, అత్యున్నత సాంకేతికతో సంపూర్ణ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల స్వీట్లను ..

చిరుధాన్యాలతో సంగం స్వీట్లు

మార్కెట్‌లోకి విడుదల చేసిన చైర్మన్‌ ధూళిపాళ్ళ 

 

చేబ్రోలు మే23: వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అద్భుత రుచులతో, అత్యున్నత సాంకేతికతో సంపూర్ణ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల స్వీట్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టిన్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీలో శనివారం నూతన స్వీట్లను ఆయన ఆవిష్కరించి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాగులు, కొర్రలు, జొన్నలు, మిక్సిడ్‌ మిలెట్‌ లడ్డూలను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానమైన మోడిఫైడ్‌ ఎటాస్‌ఫియర్‌ ప్యాకింగ్‌తో రసాయనిక సంరక్షణ పద్ధతులు లేకుండా ఎక్కువకాలం నిల్వ ఉండేలా నూతన ఉత్పత్తులను తయారు చేశామని తెలిపారు.


కరోనా కష్టకాలంలో పాడి రైతులను ఆదుకునేందుకు రూ.3 కోట్ల అదనపు బోనస్‌ అందిస్తున్నట్లు చెప్పారు. చిత్తూరు రైతులకు రూ.70 లక్షల అదనపు బోనస్‌ చెల్లించామన్నారు. కరోనా సహాయక చర్యలలో భాగంగా రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులతో సంగంపై ఆధారపడిన ప్రతి రైతుకు మంచి భవిష్యతు అందచేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎండీ గోపాలకృష్ణన్‌, పాలకవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:03:43+05:30 IST