-
-
Home » Andhra Pradesh » Guntur » dtc
-
వాహన మిత్ర లబ్ధికి బ్యాంకు ఖాతా వివరాలను అంద జేయండి
ABN , First Publish Date - 2020-11-21T05:50:40+05:30 IST
జిల్లాలో వివిధ కారణాలతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి నగదు జమ కాని వాహన మిత్ర లబ్ధిదారులు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని డీటీసీ ఈ.మీరాప్రసాదు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

డీటీసీ ఈ.మీరాప్రసాదు
గుంటూరు(తూర్పు), నవంబరు 20: జిల్లాలో వివిధ కారణాలతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి నగదు జమ కాని వాహన మిత్ర లబ్ధిదారులు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించాలని డీటీసీ ఈ.మీరాప్రసాదు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 25,177 మంది అర్హులైన వారికి వాహనమిత్ర పఽథకం ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్టు తెలిపారు. కేవలం 189 మందికి వివిధ కారణాలతో ఖాతాల్లో నగదు జమ కాలేదన్నారు.