-
-
Home » Andhra Pradesh » Guntur » dsp inspection at police station
-
పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడితే చర్యలు
ABN , First Publish Date - 2020-12-19T05:59:57+05:30 IST
అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం వెస్ట్ డీఎస్పీ కె.సుప్రజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ప్రారంభించిన రిసెప్షన్ కౌంటర్‌ను, సిబ్బంది తీరును పరిశీలించారు.

అరండల్‌పేట స్టేషన్ తనిఖీ చేసిన వెస్ట్ డీఎస్పీ సుప్రజ
గుంటూరు, డిసెంబరు 18: అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం వెస్ట్ డీఎస్పీ కె.సుప్రజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ప్రారంభించిన రిసెప్షన్ కౌంటర్‌ను, సిబ్బంది తీరును పరిశీలించారు. అనంతరం సీఐ, ఎస్‌ఐ, సిబ్బందితో సమావేశమై పెండింగ్‌లో ఉన్న పలు కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.