-
-
Home » Andhra Pradesh » Guntur » driver mruthi
-
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2020-12-28T05:40:14+05:30 IST
గుంటూరు- మాచర్ల రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్ని ఘటనలో యువకుడు మృతి చెందాడు.

రాజుపాలెం, డిసెంబరు27: గుంటూరు- మాచర్ల రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్ని ఘటనలో యువకుడు మృతి చెందాడు. మండలంలోని కోటనెమలిపురి సపీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్టంలోని నకరికల్లు మండలంలోని కందిమళ్లాయిగూడెంకు చెందిన సూరారపు దయాకర్(22) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రయాణికులను ఎక్కించుకుని హైదారాబాద్ నుంచి కావలికి బోలెరో వాహనంలో వెళ్తుండగా కోటనెమలిపురి సమీపంలోకి వచ్చేసరికే ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గాయపడిన దయాకర్‌ను పిడుగురాళ్లలోని ప్రైవేటు వైద్యాశాలలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్‌ఐ అమీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.