దుగ్గిరాల స్పోర్ట్స్‌క్లబ్‌ వ్యవస్థాపకుడు అనిల్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-13T06:31:57+05:30 IST

దుగ్గిరాల స్పోర్ట్స్‌క్లబ్‌ వ్యవస్థాపకుడు, దోస్త్‌ (దుగ్గిరాల ఒన్‌ సేవా ట్రస్ట్‌) స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యుడు జంపాల అనిల్‌కుమార్‌ (65) శనివారం మృతిచెందారు.

దుగ్గిరాల స్పోర్ట్స్‌క్లబ్‌ వ్యవస్థాపకుడు అనిల్‌ మృతి
జంపాల అనిల్‌కుమార్‌

దుగ్గిరాల, నవంబరు 12: దుగ్గిరాల స్పోర్ట్స్‌క్లబ్‌ వ్యవస్థాపకుడు, దోస్త్‌ (దుగ్గిరాల ఒన్‌ సేవా ట్రస్ట్‌) స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ సభ్యుడు జంపాల అనిల్‌కుమార్‌ (65) శనివారం మృతిచెందారు. దుగ్గిరాలలో పలు సేవా కార్యక్రమాలతోపాటు, క్రీడా రంగానికి ఎనలేని సేవలందించిన అనిల్‌కుమార్‌ ఏడాదిగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అనిల్‌ మృతికి దోస్త్‌ అధ్యక్షుడు మిక్కిలినేని గాంధీ, చాగంటి శ్రీనివాస్‌, గద్దె శ్రీనివాస్‌, కొండపనేని రవీంద్రరావు, కొత్త గిరిధరరావు పలువురు దోస్త్‌ సభ్యులు సంతాపాన్ని తెలిపారు.


Updated Date - 2020-12-13T06:31:57+05:30 IST