అందరి కృషితో స్వచ్ఛ గుంటూరు

ABN , First Publish Date - 2020-12-12T05:26:42+05:30 IST

స్వచ్ఛ గుంటూరు సాధనకు అందరూ కలిసి పనిచేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ సూచించారు.

అందరి కృషితో స్వచ్ఛ గుంటూరు
రోడ్డు శుభ్రం చేస్తున్న కమిషనర్‌ అనురాధ

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 11:  స్వచ్ఛ గుంటూరు సాధనకు అందరూ కలిసి పనిచేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ సూచించారు. స్థానిక వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పారిశుధ్య అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ, తడి పొడి విభజన నూరుశాతం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. వలంటీర్ల ఖాళీల భర్తీ  త్వరలో పూర్తి అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

వ్యర్ధాలు వేసే దుకాణాలు సీజ్‌ 


రోడ్లపై వ్యర్ధాలు వేసే దుకాణాలను సీజ్‌ చేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ ప్రజారోగ్య అధికారులను హెచ్చరించారు. స్థానిక జిల్లా కోర్టు రోడ్డు, కన్నావారితోట, ఉద్యోగనగర్‌, గుజ్జనగుండ్ల మసీదు లైన్లు తదితర ప్రాంతాల్లో శనివారం పర్యటించి పారిశుధ్యం, తడి పొడి చెత్త విభజనపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఎస్‌ రాంబాబు, ఏఈ రాము, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సోమశేఖర్‌, సెక్రటరీలు, వాలంటీర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-12T05:26:42+05:30 IST