హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T05:01:30+05:30 IST

హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ పిలుపునిచ్చారు.

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎయిడ్స్‌ డే కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పిలుపు

గుంటూరు(మెడికల్‌), డిసెంబ‌రు 1: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ పిలుపునిచ్చారు. వరల్డ్‌ ఎయిడ్స్‌ డే పురస్కరించుకొని మంగళవారం హెచ్‌ఐవీ నివారణకు జిల్లాలో కొత్తగా ప్రవేశపెట్టిన లింక్‌ వర్కర్ల ప్రాజెక్ట్‌ను ఆమె ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 36 మండలాల్లో 104 హైరిస్క్‌ గ్రామాల్లో లింక్‌ వర్కర్లు పని చేస్తారని ఆమె తెలిపారు. అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ బండారు సుబ్బారావు మాట్లాడుతూ కొవిడ్‌-19 జాగ్రత్తలు పాటిస్తూ హెచ్‌ఐవీ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌వోలు డాక్టర్‌ బండారు సుబ్బారావు, డాక్టర్‌ జయసింహ, డ్యాప్సు డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ఎల్‌.మధుసూదనరావు, డిస్ట్రిక్ట్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీవిద్య, ఐసీటీసీ సూపర్‌వైజర్‌ జె.వీరాస్వామి, లింక్‌ వర్కర్స్‌ ప్రోగ్రామ్‌ స్టేట్‌ మేనేజర్‌ ప్రభాకర్‌, షిప్‌ అధ్యక్షురాలు ఎ.రమాదేవి, టీఐ ఎన్జీవో ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, హెచ్‌ఈవో కృష్ణారెడ్డి, అపర్ణ, దుర్గాదేవి, ’పాత్‌’ కిరణ్‌, డాక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T05:01:30+05:30 IST