మార్క్‌ఫెడ్‌ అగ్రి ఇన్‌పుట్స్‌ డీఎంగా వెంకటరావు

ABN , First Publish Date - 2020-11-26T04:07:42+05:30 IST

రాష్ట్రప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఇద్దరు డీఎంలను నియమించింది. మార్క్‌ఫెడ్‌ అగ్రి ఇన్‌పుట్స్‌ డీఎంగా కె.వెంకటరావును నియమిస్తూ ఎండీ ప్రద్యుమ్న ఆదేశాలిచ్చారు.

మార్క్‌ఫెడ్‌ అగ్రి ఇన్‌పుట్స్‌ డీఎంగా వెంకటరావు
డీఎం వెంకటరావు

గుంటూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు ఇద్దరు డీఎంలను నియమించింది. మార్క్‌ఫెడ్‌ అగ్రి ఇన్‌పుట్స్‌ డీఎంగా కె.వెంకటరావును నియమిస్తూ ఎండీ ప్రద్యుమ్న ఆదేశాలిచ్చారు. ఈ మేరకు వెంకటరావు బుధవారం రామన్నపేటలోని జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల భూసార పరీక్షాకేంద్రంలో ప్రస్తుతం ఏవోగా పనిచేస్తున్న వెంకటరావు గతంలో విజిలెన్స్‌, పిట్టలవానిపాలెం మండల వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేశారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను సకాలంలో, సక్రమంగా అందించటానికి రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటుచేసిందని, అందుకు అనుగుణంగా పనిచేస్తామని డీఎం వెంకటరావు విలేకరులకు తెలిపారు.  


Read more