కొవిడ్-19పై జిల్లా అంతటా అప్రమత్తం చేయాలి : జేసీ
ABN , First Publish Date - 2020-03-16T07:19:30+05:30 IST
జిల్లాలో కరోన వైరస్(కొవిడ్-19) పాజిటి వ్ కేసులు నమోదు కానప్పటికీ అధికారులు అప్రమతంగా ఉంటూ ప్రజలెవరూ దాని భారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు.
గుంటూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోన వైరస్(కొవిడ్-19) పాజిటి వ్ కేసులు నమోదు కానప్పటికీ అధికారులు అప్రమతంగా ఉంటూ ప్రజలెవరూ దాని భారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కొవిడ్-19 నివారణ ముందస్తు చర్యలపై రెవెన్యూ, మునిసిపల్, పంచాయతీరాజ్ అధికారులతో ఆదివారం జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడు తూ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిన విదేశాల నుంచి వచ్చిన వారి వివరా లను మండలాల వారీగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు.
వీరిని వెంటనే గుర్తించి స్థానిక వైద్య అధికారులతో పరీక్షించి హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ప్రతీ పాఠశాల, కళాశాల, ఇంజనీరింగ్ కాలేజ్‌లలో విద్యార్థులకు కొవిడ్-19పై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకొ నేలా శిక్షణ ఇవ్వాలన్నారు. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్ యాజ మాన్యాలతో సమావేశం నిర్వహించి అక్కడికి వచ్చే వారిలో ఇటీవల విదేశాల నుం చి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా అని వాకబు చేయాలన్నారు. మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లను నిత్యవసర సరుకులుగా ప్రభుత్వం ప్రకటించినందున మండల పరిధిలో ఉన్న స్టాకు వివరాలను డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు ద్వారా తెలుసుకోవాలన్నారు.
జాయింట్ కలెక్టర్ దినేస్‌కుమార్ తొలుత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. కరోన వైరస్ పాజిటివ్‌లకు ఆస్పత్రులలో ఐసోలేషన్ వార్డుల్లో అందించే చికిత్సపై వైద్య అధికారులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైతే వైద్య సేవలు వినియోగించుకొనేందుకు శిక్షణలో ఉన్న నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ స్టాఫ్‌కు శిక్షణ ఇవ్వాలన్నారు. నగరపాలకసంస్థ పరిధిలో కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయితే తీసుకోవాల్సిన క్లస్టర్ కంటైమ్డ్ స్టాటర్జీపై మాక్‌డ్రిల్ నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించాలని కమిషనర్ చల్లా అనురాధని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ యాస్మిన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్, డీఈవో గంగాభవాని పాల్గొన్నారు.