-
-
Home » Andhra Pradesh » Guntur » district committee
-
భూగర్భ జలాల అంచనాకు కమిటీ నియామకం
ABN , First Publish Date - 2020-11-26T04:58:31+05:30 IST
భూగర్భ జలాలను తిరిగి అంచనా వేయడానికి జిల్లాస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది.

గుంటూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): భూగర్భ జలాలను తిరిగి అంచనా వేయడానికి జిల్లాస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీకి ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్, సభ్యులుగా జలవనరుల శాఖ ఎస్‌ఈ, డ్వామా పీడీ, సీపీవో, వ్యవసాయ శాఖ జేడీ, ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ, ఏపీఎంఐపీ/ఉద్యాన శాఖ డీడీ, అటవీ శాఖ అధికారి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, మునిసిపల్ కమిషనర్‌లు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ, నాబార్డు ఏజీఎంలను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ సమావేశమై త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఆదేవించింది.