కూరగాయల పంపిణీ

ABN , First Publish Date - 2020-04-01T10:05:14+05:30 IST

పట్టణంలోని 12వ వార్డు ప్రజలకు మాజీ కౌన్సిలర్‌ కాగిత సుధీర్‌బాబు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

కూరగాయల పంపిణీ

బాపట్ల, మార్చి 31: పట్టణంలోని 12వ వార్డు ప్రజలకు మాజీ కౌన్సిలర్‌ కాగిత సుధీర్‌బాబు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ముఖ్యఅతిథిగా పాల్గొని కూరగాయలు అందజేశారు. సూర్యలంక సముద్ర తీరంలోని నిరుపేద కుటుంబాల వారికి అంబేద్కర్‌ సేవాసమాజం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌సభ్యులు, బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల ఉద్యోగి వంకాయలపాటి హరిబాబు ఆధ్వర్యంలో మంగళవారం రిక్షా కార్మికులకు 10 కేజీల బియ్యం చొప్పున అందజేశారు. పట్టణంలోని ప్యాడిసన్‌పేట సంఘ పెద్దలు, యవ్వనస్థులు కలిసి మంగళవారం 150 మంది యాచకులకు భోజన ఏర్పాటు చేశారు.


బాపట్ల, మార్చి 31: బాపట్ల రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి బి.ఎ్‌స.నారాయణభట్టు ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయాలలో హోమియో మాత్రలు, మాస్క్‌లు పంపిణీ చేశారు.


ఫోరం ఫర్‌ బెటర్‌ బాపట్ల కార్యదర్శి డాక్టర్‌ పీసీ.సాయిబాబు మంగళవారం ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌కె.రసూల్‌కు శానిటైజర్‌లు, మా్‌స్కలను అందజేశారు.


పిట్టలవానిపాలెం, మార్చి 31: ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసరాలను రేషన్‌డీలర్లు పంపిణీ చేస్తున్న తీరును పిట్టలవానిపాలెం మండల తహసీల్దార్‌ బి.వి.ఆర్‌.సీహెచ్‌.ప్రసాద్‌ పరిశీలించారు. 


పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పిట్టలవానిపాలెం ఎంపీడీవో షేక్‌.మహబూబ్‌ సుభానీ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. పలు గ్రామాల్లో మంగళవారం  పారిశుధ్య సిబ్బంది పని తీరును ఆయన పరిశీలించారు.


కర్లపాలెం, మార్చి 31: మండలంలోని ఏట్రవారిపాలెంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పేరలి వి.ఎస్‌ సేవ ఫౌండేషన్‌ నిర్వాహకులు  గొర్రె ముచ్చు వందనం మంగళవారం మాస్క్‌లను అందజేశారు.

Updated Date - 2020-04-01T10:05:14+05:30 IST