చంద్రబాబు పిలుపుతో.. పేదలకు సాయం

ABN , First Publish Date - 2020-04-07T10:04:47+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో..

చంద్రబాబు పిలుపుతో.. పేదలకు సాయం

నాలుగు వేల మందికి నిత్యావసరాలు పంపిణీ 


తెనాలి/గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు ముందుకువచ్చి.. పేదలకు తోచినంతలో సాయం అందించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. దీంతో తెనాలిలో ఓ పారిశ్రామికవేత్త నాలుగు వార్డులను ఎంపిక చేసుకుని నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. చినరావూరుకు చెందిన పాటిబండ్ల నరేంద్రనాథ్‌ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.


పట్టణంలోని 13, 14, 15, 16 వార్డులను ఎంపికచేసుకుని ఇక్కడి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సహకారం తీసుకుని ఈ వార్డుల్లోని ప్రజలకు బియ్యం, కూరగాయలు, నిత్వావసర సరకులను పంపిణీ చేస్తున్నారు. 4,200 కుటుంబాలకు బియ్యం, కూరలు అందిస్తున్నారు. మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఈ పంపిణీని ప్రారంభించి, నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. వార్డుల్లో ప్రజల స్పందన, తీసుకున్నవారు వ్యక్తం చేస్తున్న ఆనందం.. తనకు సంతృప్తినిచ్చిందని నరేంద్రనాథ్‌ చెబుతున్నారు.

Updated Date - 2020-04-07T10:04:47+05:30 IST