-
-
Home » Andhra Pradesh » Guntur » Discontinuation of Postal Services
-
తపాలా సేవలు నిలిపివేత
ABN , First Publish Date - 2020-03-25T09:36:09+05:30 IST
దేశ వ్యాప్తంగా రైలు, రోడ్డు రవాణా నిలిచిపోవడంతో తపాలా సేవలు స్తంభించిపోయాయి.

గుంటూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా రైలు, రోడ్డు రవాణా నిలిచిపోవడంతో తపాలా సేవలు స్తంభించిపోయాయి. దీంతో జిల్లాలోని అన్ని పోస్టాఫీసులకు తాళంవేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మరో 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అప్పటివరకు తపాలా సేవలు అందే పరిస్థితి లేదు.
నిత్యం స్టాంపుల విక్రయం, డిపాజిట్లు చెల్లించుకోవడం, పార్సిల్, రిజిస్టర్, స్పీడ్‌పోస్టు బుకింగ్‌లతో రద్దీగా ఉండే తపాలా ఆఫీసులు జిల్లా కేంద్రంలో మూతబడ్డాయి. ప్రధానంగా తపాలశాఖ రైల్వే మెయిల్ సర్వీసుని ఉపయోగిస్తుంది. అలానే ఎయిర్‌మెయిల్ సేవలను కూడా తీసుకొంటుంది. ప్రస్తుతం ఈ రెండు షట్‌డౌన్ అయ్యాయి. దీంతో ఉత్తరాలు గమ్యస్థానాలకు పంపించలేని పరిస్థితి నెలకొన్నది. ఈ కారణంగా తపాలా ఆఫీసులు మూతబడ్డాయి.