స్వంత వాహనాలు ఏర్పాటు చేసుకొంటే ఒడిస్సా రాష్ట్రానికి అనుమతి

ABN , First Publish Date - 2020-05-10T07:03:08+05:30 IST

జిల్లా నుంచి ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లదలచిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులు, ప్రైవేటు ఉద్యోగులు స్వంతంగా ..

స్వంత వాహనాలు ఏర్పాటు చేసుకొంటే ఒడిస్సా రాష్ట్రానికి అనుమతి

జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌


గుంటూరు, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా నుంచి ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లదలచిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులు, ప్రైవేటు ఉద్యోగులు స్వంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకొంటే అనుమతిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ముందుగా ప్రతీ ఒక్కరికి స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారినే పంపించడం జరుగుతుందన్నారు. ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లడానికి అక్కడ ప్రభుత్వం అనుమతి అవసరం లేదన్నారు. స్వంతంగా వాహనాలు సమకూర్చుకొని వెళ్లదలుచుకొన్న వారు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాల్లో సంప్రదించాలని జేసీ విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-05-10T07:03:08+05:30 IST