తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-17T05:55:19+05:30 IST
స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది.

గుంటూరు (సాంస్కృతికం), డిసెంబరు 16: స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ధనుర్మాసాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం ప్రతిరోజూ సాయంత్రం 6.30 ప్రారంభమవుతుందని, జనవరి 13 వరకు కొనసాగుతుందన్నారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కేవీ శ్రీరంగనాయకి ప్రవచనం చేస్తూ గోదాదేవి వైశిష్ట్యాన్ని, స్వామి వారి విశేషాలను, మొదటి పాశురంలోని విశేషాలను వివరించారు.