6న ఫోర్సెనిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రాత పరీక్ష

ABN , First Publish Date - 2020-12-05T05:44:42+05:30 IST

గుంటూరు అర్బన్‌ జిల్లా పరిధిలో ఈ నెల 6న నిర్వహించే ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షకు అన్ని ఏర్పాటు చేసినట్లు రేంజి డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు.

6న  ఫోర్సెనిక్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రాత పరీక్ష

గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ


తుళ్లూరు, డిసెంబరు 4: గుంటూరు అర్బన్‌ జిల్లా పరిధిలో ఈ నెల 6న నిర్వహించే ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షకు అన్ని ఏర్పాటు చేసినట్లు  రేంజి డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. శుక్రవారం ఆయన తుళ్లూరు డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 58 పోస్టులకు గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం 2,825 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, వీరికోసం  9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2020-12-05T05:44:42+05:30 IST