సాహితీ శిఖరం..

ABN , First Publish Date - 2020-11-22T04:36:35+05:30 IST

తెలుగు సాహిత్య రంగంలో వెలుగొందిన షేక్‌ ఖాజాహుస్సేన్‌ (దేవిప్రియ) ఇకలేరు.

సాహితీ శిఖరం..

సాహిత్య వేత్తగా, జర్నలిస్టుగా చెరగని ముద్ర

స్వగ్రామం తాడికొండ కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత

రన్నింగ్‌ కామెంటరీతో  ప్రత్యేక గుర్తింపు

విషాదంలో మునిగిన సాహితీ లోకం


 దేవిప్రియ.. పరిచయ వ్యాక్యాలు అక్కర్లేని పేరు. మూడు దశాబ్దాలకు పైగా కవిగా, జర్నలిస్టుగా సాహిత్య, పత్రికా రంగాలను ప్రభావితం చేసిన బహు ముఖ ప్రజ్ఞాశాలి. అక్షర ప్రవాహాల్ని సృష్టించే నీటిపుట్ట. తెలుగు పదాలను ప్రేమగా పొదివి పట్టుకుని ఆకాశ వీధుల్లోకి పావురాలుగా వదిలే అమ్మ చెట్టు. రాజకీయ క్రీడకు, సమాజ పరి ణామానికి రన్నింగ్‌ కామెంటరీ, తెలుగు సినిమాలో రంగుల కలలను పాటగా నిలబెట్టిన కలం.


గుంటూరు(సాంస్కృతికం), నవంబరు 21: తెలుగు సాహిత్య రంగంలో వెలుగొందిన షేక్‌ ఖాజాహుస్సేన్‌ (దేవిప్రియ) ఇకలేరు. హైదరా బాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం ఉద యం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో సాహితీలోకం తీవ్ర విషాదంలో ముని గిపోయింది. తాడికొండలో 1949 ఆగస్టు 15న దేవిప్రియ జన్మించారు. తండ్రి షేక్‌ హుస్సేన్‌ సాహెబ్‌, తల్లి ఇమామ్‌బీ. 1962లో కథా రచయితగా తన సాహితీయానాన్ని ప్రారంభిం చారు. కథలు, డిటె క్టివ్‌ నవలలు, జానపదాలు, వృత్తాలు, మాత్ర ఛందస్సు ఇలా తనకు నచ్చిన ప్రక్రియలో ప్రయత్నించి.. అక్షరాల మధ్యే  జీవి తాన్ని సాగించారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి రచించిన కర్పూర వసంతరాయలు చదివి ఆ ప్రేరణతో ఆయన వన జారాయలు అనే పద్య కావ్యాన్ని రచించారు. చదువులతో కుస్తీ పడు తూనే గుంటూరు న్యూస్‌, స్వతంత్రప్రదేశ్‌, తెలుగుసీమ వంటి ప్రతికల్లో పనిచేశారు. మిత్రుడు ఎంకే సుగమ్‌బాబుతో కలిసి విప్లవం సంకలనంలో రాసిన కవిత, ఆ తరువాత జ్వాల అనే సుదీర్ఘ కవితలతో దేవిప్రియ రాజకీయ కవిగా తెరముందుకు వచ్చారు. ప్రజా గాయకుడు గద్దర్‌కు ప్రతీకగా తుఫాను తుమ్మెద పదబంధాన్ని రాశారు. అమ్మచెట్టు, నీటిపుట్ట, తుఫాను తమ్మెద, పిట్ట కూడా ఎగిరిపోవాల్సిందే, చేపచిలుక, ఇటీవలే వచ్చిన గంధకుటి సంపు టాలు ఆయన కవితా పటిమకు నిదర్శనాలు.  రంగులకల, దాసి, రగులు తున్న భారతం వంటి జాతీయ బహుమతులు పొందిన తెలుగు సినిమాలకు కథ, మాటలు రచిం చారు. జర్న లిస్టుగా దేవిప్రియ రన్నింగ్‌ కామెంటరీ ఆయ నను ఆకాశానికి ఎత్తింది. ప్రజాతంత్ర సంపా దకుడిగా వ్యవహరించిన నాటి నుంచి ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం ఇటీవలి హైదరాబాద్‌ మిర్రర్‌ వరకూ పాత్రికేయునిగా ఆయన రాసిన అనేక వ్యాసాలు, సంపా దకీయాలు గుర్తింపునిచ్చాయి.

సాధించిన అవార్డులు....

కవిగా, జర్నలిస్టుగా దేవిప్రియను అనేక పురస్కరాలు వరించాయి. గాలిరంగు అనే గ్రంథానికి ఆయనను 2017 కేంద్ర సాహిత్య అకడామీ అవార్డు వరించింది. ఢిల్లీ తెలుగు సంఘం వారి సాహితీ గౌతమి అవార్డు, తెలుగు యూనివర్సిటీ పురస్కారం, 2001లో గుంటూరు లో అరసం ఆధ్వర్యంలో జరిగిన కొండెపూడి శ్రీనివాసరావు సాహితి పురస్కారం, 2009లో విశాల సాహితి పురస్కారాన్ని ఆయన అందుకు న్నారు. ప్రజాగాయకుడు గద్దరు జీవితగాధను ఆంగ్ల చిత్రంగా మలిచి దర్శకత్వం వహించారు. అది పలు అంతర్జాతీయ చలన చిత్ర ప్రదర్శన లల్లో అవార్డులను అందుకొంది. 

Updated Date - 2020-11-22T04:36:35+05:30 IST