రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-06-25T09:55:33+05:30 IST

వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ప్రభుత్వం ద్వారా అందే రుణాలను సద్వినియోగం చేసుకొని, తిరిగి సకాలంలో చెల్లించాలని

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

గుంటూరు (కార్పోరేషన్‌), జూన్‌ 24: వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ప్రభుత్వం ద్వారా అందే రుణాలను సద్వినియోగం చేసుకొని, తిరిగి సకాలంలో చెల్లించాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ అనురాధ కోరారు. స్థానిక బ్యాంకర్స్‌, స్ర్టీట్‌ వెండర్స్‌ అసోసియేషన్‌, మెప్మా సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల చిరు వ్యాపారులు ఆర్ధికంగా నష్టపోయారని, సున్నా వడ్డీకే రూ.10 వేల రుణ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.


ఎల్‌డీఎం పీవీ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని చిరు వ్యాపారులు ఉపయోగించుకోవాలన్నారు. మెప్మా పీడీ సావిత్రి మాట్లాడుతూ రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, డిప్యూటీ సిటి ప్లానర్‌ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-25T09:55:33+05:30 IST