-
-
Home » Andhra Pradesh » Guntur » cycle tour of telugu velugu on issues of journalists
-
జర్నలిస్టుల సమస్యలపై ‘తెలుగు వెలుగుల’ సైకిల్ యాత్ర
ABN , First Publish Date - 2020-03-13T12:41:55+05:30 IST
జర్నలిస్టుల సమస్యలపై ‘తెలుగు వెలుగుల’ సైకిల్ యాత్ర

పంజాగుట్ట(ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, తెలుగు భాషను పరిపాలన భాషగా అమలు చేయాలని ‘తెలుగు వెలుగుల’ పేరుతో సైకిల్ యాత్ర చేపట్టినట్లు సీనియర్ పాత్రికేయుడు పొన్నాల గౌరీశంకర్ తెలిపారు. యాత్రలో భాగంగా గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చారు. విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న తాను యాత్ర ప్రారంభించానని, ఇప్పటివరకు జనగామ, వరంగల్, ములుగు, సంగారెడ్డి తదితర జిల్లాల్లో సైకిల్‌పై యాత్ర నిర్వహించి నగరానికి చేరుకున్నానని తెలిపారు. ఇక్కడి నుంచి మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లనున్నట్లు తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించాలని కో రుతూ ఈ యా త్రను కొనసాగిస్తున్నామన్నారు. యా త్ర సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రాలు కూడా ఇవ్వనున్న ట్లు తెలిపారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి ఆయనను సన్మానించారు.