నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

ABN , First Publish Date - 2020-12-16T05:10:13+05:30 IST

నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మ జనార్ధనరెడ్డి అన్నారు.

నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు

 ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మ జనార్ధనరెడ్డి


యడ్లపాడు, డిసెంబరు 15 : నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మ జనార్ధనరెడ్డి అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని టెక్స్‌టైల్‌పార్కు, నూలుమిల్లులను మంగళవారం ఆయన సందర్శించారు.  కల్పతరువు నూలుమిల్లులో విలేకరులతో మాట్లాడుతూ  వివిధ పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు. టెక్స్‌టైల్‌పార్కుకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు 25ఎంజీఏ సామర్ద్యంగల సబ్‌స్టేషన్‌ ఏర్పాటుచేయాలని, అందుకు స్థలం కేటాయించాలని తమశాఖ ద్వారా కోరినట్లు తెలిపారు.  అత్యధిక విద్యుత్‌ ఆదాయం మిల్లుల నుంచే వస్తుందని ఏపీ స్పిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ చైర్మన్‌ లంకా రఘురామిరెడ్డి అన్నారు. పీసీపీడీసీఎల్‌ డైరెక్టర్‌ సంతోషరావు, సీఆర్‌డీఏ ఎస్‌ఈ మురళీకృష్ణయాదవ్‌, గుంటూరు డీఈ శ్రీనివాసరెడ్డి, ఏఏవో ఆనందకుమార్‌, ఏడీఈ సీహెచ్‌ రాంబొట్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T05:10:13+05:30 IST