-
-
Home » Andhra Pradesh » Guntur » cultural
-
23 నుంచి తెనాలిలో ఆహ్వాన నాటిక పోటీలు
ABN , First Publish Date - 2020-12-20T04:59:01+05:30 IST
తెనాలిలో నెల 23, 24, 25వ తేదీల్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పొలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారకరామారావు స్మారక 13వ రాష్ట్రస్థాయి ఆహ్వాననాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు షేక్ జానీబాషా తెలిపారు.

తెనాలి రూరల్, డిసెంబర్ 19: తెనాలిలో నెల 23, 24, 25వ తేదీల్లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పొలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారకరామారావు స్మారక 13వ రాష్ట్రస్థాయి ఆహ్వాననాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు షేక్ జానీబాషా తెలిపారు. శనివారం పట్టణంలోని సీసీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వరపేటలోని మునిసిపల్ ఓపెన్ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ లెజెండ్ అవార్డు, తుమ్మల సాహితీ అవార్డును ప్రదానం చేస్తామన్నారు. సమావేశంలో పరిషత్ కోశాధికారి గోపరాజు విజయ్, శివప్రసాద్. షరీఫ్, భవాణి, మోహన్‌రావు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.