నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-12-12T05:25:07+05:30 IST

అర్బన్‌ జిల్లా పరిధిలో రోజూ ఉదయం, సాయంత్రం విజుబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి ఆదేశించారు.

నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సమీక్షా సమావేశంలో అర్బన్‌ ఎస్పీ 

గుంటూరు, డిసెంబరు 11: అర్బన్‌ జిల్లా పరిధిలో రోజూ ఉదయం, సాయంత్రం విజుబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్‌ కార్యాలయంలో నేరసమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాలు అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘాఉంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, మిస్సింగ్‌, అనుమానాస్పద మృతికి సంబందించిన కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ఈ నెల 12న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ గంగాధరం, సీసీఎస్‌ అదనపు ఎస్పీ మనోహరరావు, డీఎస్పీలు శీతారామయ్య, వీవీ రమణకుమార్‌, జెస్సీ ప్రశాంతి, కేఎస్‌ రవికుమార్‌, డీసీఆర్‌బీ డీఎస్పీ పి.శ్రీనివాసరావు, ఎం.బాలసుందరరావు, ఏవో వరలక్ష్మితో పాటు సీఐలు, ఎస్‌ఐలు పాల్గన్నారు

 

Updated Date - 2020-12-12T05:25:07+05:30 IST