మారణాయుధాలతో ఇద్దరి పట్టివేత

ABN , First Publish Date - 2020-11-26T04:53:19+05:30 IST

తాడేపల్లి పరిధిలో బుధవారం నిర్వహించిన పోలీసు తనిఖీల్లో ఇద్దరు మారణాయుధాలతో ఆటోలో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు.

మారణాయుధాలతో ఇద్దరి పట్టివేత

తాడేపల్లి టౌన్‌, నవంబరు 25: తాడేపల్లి పరిధిలో బుధవారం నిర్వహించిన పోలీసు తనిఖీల్లో ఇద్దరు మారణాయుధాలతో ఆటోలో ప్రయాణిస్తూ పట్టుబడ్డారు. ఆటోలో రెండు కత్తులను, కారం పొట్లాలను పోలీసులు గుర్తించారు. ఇద్దరిలో తాడేపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి విజయవాడలోని తన ఆటో ఓనర్‌ వద్ద నుంచి పెనుమాక గ్రామానికి చెందిన స్థానిక వ్యక్తికి కొంత నగదు అప్పు ఇప్పించగా, ఆ అప్పు తీర్చకపోవడంతో దాడి చేయడానికి వెళుతున్నట్టు సమాచారం. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.  

Read more