-
-
Home » Andhra Pradesh » Guntur » crime
-
కాలువలో పడి తల్లీకొడుకు మృతి
ABN , First Publish Date - 2020-12-20T05:07:05+05:30 IST
తల్లీకొడుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది.

ముప్పాళ్ళ, డిసెంబరు 19: తల్లీకొడుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసులు కథనం మేరకు.. రాజుపాలెం మండలం గణపవరానికి చెందిన పల్లపాటి కోటేశ్వరరావు కుటుంబం ఏడాదిగా చాగంటివారిపాలెంలో పొలం కౌలుకు తీసుకుని అక్కడే నివాసం ఉంటోంది. శనివారం పొలంలో మందు చల్లేందుకు భార్య శ్రీలక్ష్మి(51), కొడుకు వెంకట సాయిబాబు(25)తో కలసి వెళ్ళాడు. భార్య, కుమారుడు నీరు తీసుకొచ్చేందుకు గుంటూరు బ్రాంచ్ కెనాల్‌కు వెళ్ళారు. నీటికోసం కాలువలో దిగగా శ్రీలక్ష్మి ప్రమాద వశాత్తు కాలుజారి మునిగి పోయింది. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు సాయిబాబు కాలువలోకి కొట్టుకుపోయాడు. ఎస్‌ఐ నజీర్ బేగ్ ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వారిద్దరి మృతదేహాలు మేరిగపూడి మేజర్‌కు పైన ఉన్న గుంటూరు బ్రాంచ్ కెనాల్ లాకుల వద్ద కన్పించాయి. సాయి బాబు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరాడు. కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.