ఆటో బోల్తా.. పదిమందికి కూలీలకు గాయాలు

ABN , First Publish Date - 2020-12-20T04:59:50+05:30 IST

పట్టణ శివారు నమాజుకుంట సమీపంలో శనివారం ఆటో బోల్తాపడి 10మంది గాయాలపాలయ్యారు.

ఆటో బోల్తా.. పదిమందికి కూలీలకు గాయాలు

వినుకొండటౌన్‌, డిసెంబరు 19: పట్టణ శివారు నమాజుకుంట సమీపంలో శనివారం ఆటో బోల్తాపడి 10మంది గాయాలపాలయ్యారు. మండలంలోని తిమ్మాయపాలేనికి చెందిన 15మంది కూలీలు వినుకొండలో శ్లాబ్‌ పని ముగించుకొని తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వారికి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన మరియమ్మ, పోలమ్మ, కొండమ్మను నరసరావుపేటకు తరలించారు.  ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు క్షతగాత్రులను పరామర్శించారు.  

Read more