కాలువలో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2020-12-19T05:32:12+05:30 IST

కాళ్లు కడుక్కొనేందుకు కాలువలోకి దిగి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది.

కాలువలో పడి యువకుడి మృతి

 నకరికల్లు, డిసెంబరు 18: కాళ్లు కడుక్కొనేందుకు కాలువలోకి దిగి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నకరికల్లుకు చెందిన షేక్‌ వినుకొండ దరియా మహబూబ్‌(23) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. కాళ్ళు కడుక్కొనేందుకు శ్రీరాంపురం సమీపాన గల కాలువలోకి దిగి జారిపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more