వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-19T05:31:14+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో రుద్రవరం గ్రామానికి చెందిన ఆత్మహత్యకు పాల్పడింది.

వివాహిత ఆత్మహత్య

అచ్చంపేట, డిసెంబరు 18: కుటుంబ కలహాల నేపథ్యంలో రుద్రవరం గ్రామానికి  చెందిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చాగంటి గీతారెడ్డి(25)కి కృష్ణా జిల్లాకు చెందిన రవీంద్రరెడ్డితో రెండేళ్ల కిందట వివాహం అయింది. కుటుంబ కలహాలతో లాక్‌డౌన్‌ సమయం నుంచి రుద్రవరంలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో  పెట్రోలు తీసుకుని పక్కనే ఉన్న పొలం వద్దకు వెళ్లి ఒంటిపై పోసుకొని నిప్పంటిచుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపుల వలన ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు.  

Read more