రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-16T05:16:09+05:30 IST
బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.
దుగ్గిరాల, డిసెంబరు 15: బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. కంకిపాడుకు చెందిన లంకిశెట్టి కిషోర్(28) మంగళవారం ద్విచక్రవాహనంపై తెనాలి మండలం నందివెలుగుకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. మోరంపూడి గ్రామం దాటుతుండగా, విజయవాడ వైపు నుంచి, ఎదురుగా వస్తున్న వాహనం, బైక్ ఢీకొన్నాయి. గాయాలపాలైన కిషోర్‌ను 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.