-
-
Home » Andhra Pradesh » Guntur » crime
-
ఆటో బోల్తా.. మహిళ మృతి
ABN , First Publish Date - 2020-12-07T05:06:13+05:30 IST
మండలంలోని సాతులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

నాదెండ్ల, డిసెంబరు 6 : మండలంలోని సాతులూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం మండలం గుండాలపాడుకు చెందిన పుల్లగూర సువార్త(56) ఆటోలో నరసరావుపేట నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా సాతులూరు సమీపంలోని పొనుగుపాడు కాలువ సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సువార్తను నరసరావుపేట తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త మోషే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.