-
-
Home » Andhra Pradesh » Guntur » crime
-
బస్సు ఢీ కొని మహిళ మృతి
ABN , First Publish Date - 2020-12-06T05:54:20+05:30 IST
బస్సు ఢీ కొనటంతో మహిళ మృతి చెందిన ఘటన సజ్జావారిపాలెం వద్ద జరిగింది.

రేపల్లె, డిసెంబరు 5: బస్సు ఢీ కొనటంతో మహిళ మృతి చెందిన ఘటన సజ్జావారిపాలెం వద్ద జరిగింది. నగరం ఎస్‌ఐ వాసు కథనం ప్రకారం పల్లపట్లకు చెందిన పెద్దిబోయిన లక్ష్మీకుమారి(44) శనివారం భర్త శ్రీనివాసరావుతో కలిసి కృష్ణాజిల్లా మోపిదేవిలో బంధువుల ఇంటికి వెళుతోంది. సజ్జావారిపాలెం వద్ద ఎదురుగా రేపల్లె నుంచి వస్తున్న బస్సు ఢీ కొనటంతో లక్ష్మీకుమారి అక్కడికక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.