-
-
Home » Andhra Pradesh » Guntur » crime
-
విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ABN , First Publish Date - 2020-12-06T05:43:49+05:30 IST
మండలంలోని మిట్టపాలెం గ్రామంలో పసుపులేటి నాగబాబు(24) విద్యుత్ షాక్‌తో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

అచ్చంపేట, డిసెంబరు 5 : మండలంలోని మిట్టపాలెం గ్రామంలో పసుపులేటి నాగబాబు(24) విద్యుత్ షాక్‌తో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. నాగబాబు బీటెక్ చదివి హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దకు వచ్చి పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురి కాగా అక్కడికక్కడే మృతి చెందినట్టు నాగబాబు బంధువులు తెలిపారు. మృతుడికి తల్లి సత్యవతి ఉన్నారు.