కుమారుడిని హత మార్చిన తండ్రి

ABN , First Publish Date - 2020-12-06T04:36:31+05:30 IST

నిత్యం మద్యం సేవించి వేధిస్తున్నాడని కుమారుడి పై దాడి చేసి హత మార్చిన తండ్రి సంఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని పారుపల్లిలో శనివారం రాత్రి జరిగింది.

కుమారుడిని హత మార్చిన తండ్రి

మద్యం సేవించి వేధిస్తున్నాడని..


క్రోసూరు, డిసెంబరు 5 : నిత్యం మద్యం సేవించి వేధిస్తున్నాడని కుమారుడి పై దాడి చేసి హత మార్చిన తండ్రి సంఘటన గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని పారుపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ఈ సంఘటనలో పారుపల్లి బాజీ బాబు(22) అక్కడికక్కడే మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పారుపల్లి వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు బాజీ బాబు మద్యానికి బానిసై ప్రతి రోజు డబ్బుల కోసం ఇంట్లో వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన బాజీ బాబుకు, తండ్రి వెంకటేశ్వర్లుకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు గొడ్డలితో బాజీ బాబుపై దాడి చేశాడు. ప్రాణం ఉందేమోనన్న ఆశతో స్థానికులు బాజీ బాబును సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు డాక్టర్‌  ధ్రువీకరించారు. క్రోసూరు ఎస్‌ఐ శివరామయ్య ఆధ్వర్యంలో  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-12-06T04:36:31+05:30 IST