-
-
Home » Andhra Pradesh » Guntur » cpm dharna
-
మునిసిపల్ కార్యాలయం వద్ద ధర్నా
ABN , First Publish Date - 2020-11-21T06:07:41+05:30 IST
తాడేపల్లి పట్టణంలోని మహానాడు, కృష్ణనగర్ ఏరియాల పరిధిలోని పోరంబోకు స్థలాలలో ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు.

తాడేపల్లి టౌన్, నవంబరు 20: తాడేపల్లి పట్టణంలోని మహానాడు, కృష్ణనగర్ ఏరియాల పరిధిలోని పోరంబోకు స్థలాలలో ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మునిసిపల్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి మునిసిపల్ కమిషనర్ కనీసం ఇళ్లు మరమ్మతులు చేసుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వకుండా కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని, ప్రజల మనోభావాలను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న వారితో మునిసిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి మాట్లాడారు. ఇళ్ల మరమ్మతులు అత్యవసరమైతే అర్జీ పెట్టుకోవాలని, తమ సిబ్బంది వచ్చి పరిశీలించిన తరువాత అనుమతులపై స్పష్టత ఇస్తామని చెప్పారు. అలాగే తనకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని, పోరంబోకు స్థలాలలో ఇళ్ల నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డన్న, నేతలు డి.వెంకటరెడ్డి, బి.వెంకటేశ్వర్లు, వి.దుర్గారావు, ఎస్.ముత్యాలరావు, కరుణ తదితరులు పాల్గొన్నారు.