మొండి ప్రభుత్వాల మెడలు వంచుతాం

ABN , First Publish Date - 2020-12-02T05:06:34+05:30 IST

కష్టజీవులు తలచుకుంటే మొండి ప్రభుత్వాల మెడలు వంచుతారని, దీనికి దేశ రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటమే నిదర్శనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

మొండి ప్రభుత్వాల మెడలు వంచుతాం
సమావేశంలో ప్రసంగిస్తున్న రామకృష్ణ

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

గుంటూరు(సంగడిగుంట), డిసెంబరు1: కష్టజీవులు తలచుకుంటే మొండి ప్రభుత్వాల మెడలు వంచుతారని, దీనికి దేశ రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటమే నిదర్శనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నగర ముఠా కార్మిక సంఘం, సీపీఐ, ఏఐటీయూసీ, జీవీ కృష్ణారావు మెమోరియల్‌ ట్రస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రేగుల రాఘవయ్యభవన్‌ వద్ద  జీవీ కృష్ణారావు వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జీవీ కృష్ణారావు అందించిన స్ఫూర్తితో కార్మికులు పోరాటాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాలకు ఊడిగం చేస్తుందన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, మద్యం ముసుగులో కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. క్యార్యక్రమంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకట రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ నగర గౌరవాధ్యక్షులు జి.సురేష్‌బాబు, జీవీకే మెమోరియల్‌ ట్రస్టు చైర్మన్‌ అమ్మిశెట్టి శివ, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు గని తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-02T05:06:34+05:30 IST