హౌస్ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు: ముప్పాళ్ల

ABN , First Publish Date - 2020-10-31T14:31:09+05:30 IST

దళిత రైతుల చేతికి బేడీలు రాష్ట్ర ప్రభుత్వానికి శాపంగా వెంటాడతాయని సీపీఐ రాష్ట్ర

హౌస్ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు: ముప్పాళ్ల

గుంటూరు: దళిత రైతుల చేతికి బేడీలు రాష్ట్ర ప్రభుత్వానికి శాపంగా వెంటాడతాయని సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు హెచ్చరించారు. హౌస్ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టం చేశారు.  అకారణంగా  దళిత రైతులను 8 రోజులుగా జైల్లో కుక్కడం ఏ చట్టం ప్రకారం చేశారని ప్రశ్నించారు. ఈ దుర్మార్గానికి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు. చలో జైలు ఇప్పటికే జయప్రదం అయినట్లే అని... ఈరోజు జరిగే ఉద్యమం కొనసాగుతుందని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 

Read more