ఢిల్లీలో రైతుల పోరాటం చారిత్రాత్మకం

ABN , First Publish Date - 2020-12-16T04:19:44+05:30 IST

ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు.

ఢిల్లీలో రైతుల పోరాటం చారిత్రాత్మకం
మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌

సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌

మంగళగిరి క్రైమ్‌, డిసెంబరు 15: ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం చారిత్రాత్మకమని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు.  రైతుల పోరాటానికి మద్దతుగా  మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో  మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, పి.శివప్రసాద్‌, వై.వెంకటేశ్వరరావు, యు.సత్యనారాయణ జె.జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో..


రైతుల పోరాటానికి సంఘీభావంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని గోపాలకృష్ణ ఽథియేటర్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  సీపీఎం నాయకులు జేవీ రాఘవులు, సీఐటీయూ నాయకులు రామచంద్రరావు,  ప్రజారోగ్య వేదిక జిల్లా నాయకులు  డాక్టర్‌ కేవీఎస్‌ సాయిప్రసాద్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ కార్యదర్శి  ఎం.బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-12-16T04:19:44+05:30 IST