-
-
Home » Andhra Pradesh » Guntur » covid19
-
గుంటూరు జిల్లాలో 41 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-19T06:04:01+05:30 IST
జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు అందిన 6,472 ఫలితాల్లో 41 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

గుంటూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం ఉదయం వరకు అందిన 6,472 ఫలితాల్లో 41 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. పాజిటివ్ రేట్ కేవలం 0.63గా ఉన్నది. మిగతా 6,431(99.37 శాతం) మందికి నెగిటివ్ వచ్చింది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరులో 16, మంగళగిరి, తుళ్లూ రు, రెంటచింతల, చిలకలూరిపేట, భట్టిప్రోలు, బాపట్లలో రెండేసి, తెనాలిలో 3 కేసులు ఉన్నాయి. మరికొన్ని మండలాల్లో మరో 10 కేసులు వచ్చాయి. దీంతో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 75,785కి చేరింది.