56 మందికి కరోనా
ABN , First Publish Date - 2020-12-30T05:15:46+05:30 IST
జిల్లాలో మంగళ వారం ఉదయం వరకు 3,975 శాంపిల్స్ రిపోర్టులు రాగా వాటిలో 56 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
గుంటూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళ వారం ఉదయం వరకు 3,975 శాంపిల్స్ రిపోర్టులు రాగా వాటిలో 56 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మిగిలిన 3,919 మం దికి నెగిటివ్ వచ్చింది. గుంటూరు నగరంలో 24, నరసరావుపేట మునిసిపాలిటీలో 7, తాడేపల్లిలో 2, పొన్నూరులో 1, బాపట్లలో 2, చిలకలూరిపేటలో 2, నరసరావుపేట రూరల్‌లో 3, తాడేపల్లి రూరల్‌లో 3, పొన్నూరు రూరల్‌లో 2, నాదెండ్లలో 2, దాచేపల్లి, గుం టూరు రూరల్, గురజాల, ముప్పాళ్ల, పెదనందిపాడు, ప్రత్తిపాడు, రేపల్లె రూరల్, చుం డూరులో ఒక్కో కేసు నమోదైంది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్- 19 బారిన పడిన వారి సంఖ్య 76,294కి చేరుకోగా వీరిలో 75,046 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 521 మంది చికిత్స పొం దుతుండగా 727 మంది చనిపోయిన ట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ యాస్మిన్ తెలిపారు.