1.15 శాతానికి తగ్గిన కరోనా
ABN , First Publish Date - 2020-12-12T05:23:22+05:30 IST
కరోనా పాజిటివ్ రేటు 1.15 శా తానికి తగ్గింది. శుక్రవారం ఉదయం వరకు అందిన 5,562 శాంపిల్స్ ఫలి తా ల్లో కేవలం 64 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది.
గుంటూరు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్ రేటు 1.15 శా తానికి తగ్గింది. శుక్రవారం ఉదయం వరకు అందిన 5,562 శాంపిల్స్ ఫలి తా ల్లో కేవలం 64 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా 5,498 (98.95 శాతం) మందికి నెగిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో ఇప్పటివరకు 75,420 మంది వైరస్ బారిన పడగా వారిలో 73,834 మంది రికవరీ అయ్యారు. గుంటూరులో 18, ప్రత్తిపాడులో 5, రేపల్లెలో 5, కొల్లూరులో 4, అమరావతి, తాడేపల్లి, రొంపిచర్లలో మూడేసి కేసులు, మరికొన్ని మండలాల్లో 23 కేసులు వచ్చినట్లు డీఎంహెచ్‌వో యాస్మిన్ తెలిపారు.