నెమ్మదించిన కరోనా

ABN , First Publish Date - 2020-12-02T05:21:11+05:30 IST

నాలు గు నెలల పాటు కరోనా వైరస్‌ విజృంభణతో తలె త్తిన ఆందోళనకర పరిస్థితుల నుంచి జిల్లా కోలు కుంటోన్నది.

నెమ్మదించిన కరోనా

నవంబరులో భారీగా తగ్గిన కేసులు

30 రోజుల్లో 5,662 మందికి పాజిటివ్‌

15 శాతం నుంచి రెండు కంటే దిగువకు..

నిర్లక్ష్యం చేస్తే సెకండ్‌ వేవ్‌ అని హెచ్చరికలు


గుంటూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): నాలు గు నెలల పాటు కరోనా వైరస్‌ విజృంభణతో తలె త్తిన ఆందోళనకర పరిస్థితుల నుంచి జిల్లా కోలు కుంటోన్నది. గడిచిన నవంబరులో కేసులు భారీగా తగ్గాయి. వాటితో పాటే మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఒకదశలో పాజిటివ్‌ రేటు 15 శాతం వరకు వెళ్లి నేడు రెండు శాతం కంటే దిగువకు వచ్చేసింది. అంతేకాకుండా డిశ్చార్జిలు జూలైలో 20 శాతం ఉండగా నేడు 98 శాతానికి చేరాయి. ఇదే తగ్గుదల కొనసాగితే చాలావరకు వైరస్‌ వ్యాప్తి జిల్లాలో అదుపులోకి వస్తుందని అధికారవర్గాలు భావిస్తున్నా యి. జిల్లాలో కరోనా ఉచ్ఛస్థితి జూలై నుంచి ప్రారం భమైంది. అంతకుముందు మార్చి, ఏప్రిల్‌, జూన్‌ నెలలు కలిపి మొత్తం 1,595 కేసులు నమోదైతే ఒక్క జూలైలో 14,692 మందికి వైరస్‌ సోకింది. ఆగస్టులో ఈ సంఖ్య మరింత పెరిగి 21,093 నమోదైంది. సెప్టెంబరులో కాస్త తగ్గినా పాజిటివ్‌ కేసులు 18,929 నమోదయ్యాయి. అక్టోబరులో 12,530 కేసులు వచ్చాయి. నవంబరు లో పాజిటివ్‌ శాతం కిందికి రావడంతో కేసుల సంఖ్య తగ్గి 5,662గా నమోదైంది. అక్టోబరుతో పోల్చి చూస్తే నవంబరులో దాదాపు 54.81 శాతం కేసులు తగ్గా యి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుత డిసెంబరులో కేసులు మూడు వేల లోపునకు తగ్గిపోవాలి.


తగ్గిన మరణాలు..

ఏప్రిల్‌ నెల నుంచి కరోనా మరణాలు ప్రారంభం అయ్యాయి. ఆ నెలలో 9, మేలో 2, జూన్‌లో 17 మంది వైరస్‌తో చనిపోయారు. జూలై నెల వచ్చే సరికి రోజుకు ఏడు నుంచి ఎనిమిది మరణాలు జరిగాయి. దాంతో ఆ నెలలో 226, ఆగస్టులో 225, సెప్టెంబరులో 115 మంది, అక్టోబరులో 87 మంది చనిపోయారు. కాగా నవం బరులో  31 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 713 మంది చని పోగా వారిలో 60 ఏళ్లు పైబడి న వారు 426 మంది ఉన్నారు. 45 నుంచి 59 మధ్యన 195 మంది, 30 నుంచి 44 మధ్యన  75 మంది, 15 నుంచి 29 ఏళ్ల వయస్సు మధ్యన వారు 17 మంది చని పోయారు. ఇదిలా వుంటే జూలై నెలలో డిశ్చార్జి రేటు చాలా తక్కువగా ఉన్నది. అప్పుడు నిత్యం వెయ్యి వరకు కేసులు వచ్చాయి. అయితే క్రమేపి కరోనా బారిన పడిన వారు కోలుకోవడంతో ప్రస్తుతం జిల్లాలో 98.1 శాతం మంది మహమ్మారిని జయించారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో వలే సెకండ్‌ వేవ్‌ రాకుండా ఉంటే చాలావరకు కరోనా వైరస్‌ జిల్లాలో అదుపు లోకి వచ్చినట్లేనని అధికారులు చెబుతున్నారు. తగ్గాయి కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి.


కొత్తగా 87 కేసులు

జిల్లాలో కొత్తగా 87 మందికి కరోనా వైరస్‌ సోకింది. మంగళ వారం ఉదయం వరకు అందిన వివిధ ల్యాబ్‌ల 4,681 శాంపిల్స్‌ ఫలితాల్లో 1.86 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన 4,594 (98.14 శాతం) మందికి నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం 695 యాక్టివ్‌ కేసులున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌ తెలిపారు. మంగళ వారం మరో 5,280 శాంపిల్స్‌ని టెస్టింగ్‌ నిమిత్తం సేకరించారు. కొత్తగా గుంటూరు నగరంలో 32, బాపట్లలో 6, తెనాలిలో 6, వట్టి చెరుకూరులో 4, నాదెండ్లలో 4, నిజాంపట్నంలో 4 కేసులు నమో దయ్యాయి. మిగిలిన మండలాల్లో మరో 31 మందికి వైరస్‌ సోకింది. 


Updated Date - 2020-12-02T05:21:11+05:30 IST