సీసీఐ పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-11-16T03:51:11+05:30 IST
పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఏపీ సీసీఐ జీఎం జి.సాయిఆదిత్య ఆదేశించారు.

సీసీఐ పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి
గుంటూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఏపీ సీసీఐ జీఎం జి.సాయిఆదిత్య ఆదేశించారు. గుంటూరు సీసీఐ కార్యాలయంలో పత్తి కొనుగోళ్ళపై మార్కెటింగ్ జేడీలతో శనివారం ఆయన సమీక్షించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు నేరుగా లూజు పత్తి తెచ్చుకోవాలన్నారు. మార్కెటింగ్ జేడీలు రామాంజనేయులు, కాకుమాను శ్రీనివాసరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.