-
-
Home » Andhra Pradesh » Guntur » corporation
-
అందరి సహకారంతో స్వచ్ఛ గుంటూరు సాధ్యం
ABN , First Publish Date - 2020-12-28T06:14:30+05:30 IST
వ్యాపార సంస్థలు పరిశుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ గుంటూరు సాధ్యమని నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు.

కమిషనర్ చల్లా అనురాధ
గుంటూరు(కార్పొరేషన్) డిసెంబరు 27: వ్యాపార సంస్థలు పరిశుభ్రంగా ఉంటేనే స్వచ్ఛ గుంటూరు సాధ్యమని నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా పీవీకే నాయుడు మార్కెట్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛ మార్కెట్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న నిషేదిత కవర్లను వినియోగించరాదన్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, మార్కెట్ వర్తకుల సంఘం ప్రెసిడెంట్ సూరిబాబు, శివాజీ, బోసు తదితరులు పాల్గొన్నారు.