విక్రయదారులకు..కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-09T07:48:24+05:30 IST

కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్లలోని విక్రయదారులకు కరోన వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని రాష్ట్ర

విక్రయదారులకు..కరోనా పరీక్షలు

రాబోయే వారం రోజుల్లో నిర్వహించాలి

వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరి ఆదేశాలు


గుంటూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): కంటైన్‌మెంట్‌, రెడ్‌ జోన్లలోని విక్రయదారులకు కరోన వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక  కూరగాయల మార్కెట్లు, మొబైల్‌ మార్కెట్లలో సరుకులు విక్రయిస్తోన్న వారికి రాబోయే వారం రోజులు ఈ పరీక్షలపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ని ఆదేశించారు.


ఆయా మార్కెట్లలో నిత్యం వేల మంది ప్రజలు వెళ్లి సరుకులు కొనుగోలు చేస్తున్న క్రమంలో ఎవరికైనా వైరస్‌ సోకి ఉంటే దాని వలన ఆయా వ్యాపారులకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ దృష్ట్యా వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 20 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా అందులో 59 క్లస్టర్లుగా విభజించారు. ఈ ప్రాంతాల్లో వివిధ సేవల నిమిత్తం వచ్చే వారు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నా వారందరికీ కరోన పరీక్షలు నిర్వహించడం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-05-09T07:48:24+05:30 IST