గుంటూరు జిల్లాలో కొత్తగా 550మందికి పాజిటివ్..

ABN , First Publish Date - 2020-09-18T14:21:26+05:30 IST

జిల్లాలో కొత్తగా 550 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం వివిధ..

గుంటూరు జిల్లాలో కొత్తగా 550మందికి పాజిటివ్..

మొత్తం కేసుల సంఖ్య 49,484

పాజిటివ్‌ శాతం తగ్గింది..: కలెక్టర్‌

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 550  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన 7,661  పరీక్షల శాంపి ల్స్‌లో ఈ సంఖ్య నమోదు అయింది. దీంతో జిల్లా లో ఇప్పటివరకు కొవిడ్‌-19 బారినపడిన వారి సంఖ్య 49,484కి చేరింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో తొమ్మిదిమంది కరోనా బాధితులు చనిపోయారు. జిల్లాలో కొవిడ్‌-19  కొంతవరకు తగ్గుముఖం పట్టిందని కలెక్టర్‌ శా మ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. గతంలో పరీ క్షలు నిర్వహిస్తే 13 శాతంపైగా పాజిటివ్‌ కేసులు వచ్చేవి.


అది నేడు 10 శాతానికి తగ్గింది. గురు వారం కేవలం 7.18 మందికే పాజిటివ్‌ వచ్చింది. ఈ శాతాన్ని ఇంకా తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామన్నారు. ప్రజలెవ్వరూ నిర్లక్ష్యం ఉండకుండా మాస్కులు ధరించి, బయటకు వచ్చినప్పుడు కనీసం ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలన్నారు. సమూహాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత చేతులను శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. అనుమానిత లక్షణాలున్న వారు ఇంట్లో కూడా మాస్కులు ధరిస్తే ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నారు. మాస్కు ధరించు - కరోనాని తరిమికొట్టు అనే నినాదంతో ముందుకు వెళుతున్నామమని కలెక్టర్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-18T14:21:26+05:30 IST